ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు*
సూర్య దమ్మపేటఅశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల రాంబాబు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఆయన నివాసంలో కలసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాల అమలు తీరును ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, పార్టీ క్యాడర్‌ను కలుపుకొని మరింత చురుగ్గా ముందుకు సాగాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారు భావించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొప్పుల రాంబాబుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ బాబు, అశ్వారావుపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గద్దల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ దస్తగిర్ దమ్మపేట