మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్
మెదక్ ; మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశం అదనపు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడింది.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు, విద్యార్థుల విద్యాభ్యాసం, కుటుంబ వ్యవస్థ మరియు సమాజంపై తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతున్నాయని తెలిపారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగంపై కఠిన నిఘా ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలునిర్వహించాలలనీ,మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి అవసరమైన వైద్య సేవలు, కౌన్సెలింగ్ మరియు పునరావాస సహాయం అందించాలన్నారు.
పిల్లలు, కౌమారదశ యువతలో మాదకద్రవ్యాల వినియోగం పట్ల అవగాహన కల్పించాలినీ,
ప్రతి శాఖ తన పరిధిలో చేపట్టిన కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్య సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.