BREAKING
మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం త్వరలో మార్కో రూబియోతో బ్రెజిల్ విదేశాంగ మంత్రి భేటీ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు హ్యాకింగ్ ఘటనలపై బినాన్స్ 90 శాతం దొంగిలించబడిన అసెట్స్ రీప్లేస్ చేసినట్లు వెల్లడి ప్రజా రక్షణలో సుదీర్ఘ సేవలు.. ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య

దేశ ఐక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Select Suryaa Now
దేశ ఐక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

మెదక్, : దేశ ఐక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. భారతదేశ ఐక్యత కోసం ఉక్కు సంకల్పంతో పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు, స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్ హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి భారతదేశ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి, సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ సమగ్రతను కాపాడటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ దేశ సమైక్యత, సోదరభావం, జాతీయ సమగ్రతను కాపాడేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యువజన, క్రీడల శాఖ అధికారి రమేష్, ఏఓ యూనస్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.