BREAKING
గుమ్మేపల్లిలో జోరందుకున్న సైకిల్ ప్రచారం – అభ్యర్థులకు ప్రజల మద్దతు కోరిన నాయకులు* రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌లో మెదక్ విద్యార్థినికి ప్రథమ స్థానం ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్* * రెండు తుపాకులు, 37 ఇనుప గుండ్లు స్వాధీనం… వన్యప్రాణుల మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు-సీఐ నాగరాజు, ఎస్సై రాజేష్ కుమార్..* పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి బ్రిడ్జి నిర్మాణానికి మట్టి నమూన సేకరణ... మట్టి నమూన పనుల పరిశీలిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు... మధుర నగర్ వెంచర్ ప్లాట్ల వివాదం.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు హాలియా మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడిగా నంద్యాల వేణు నియామకం మీదివేములలో టీడీపీ ముమ్మర ప్రచారం విరువూరు, పాపన్నగారిపల్లిలో కూటమి ప్రచార సందడి! సైబర్ మోసాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష.. -- అవగాహనతోనే నేరాల నియంత్రణ సాధ్యం -- నారాయణపేటలో పోలీసుల ఫ్లాష్ వాక్ – బాధితులు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి -- నారాయణపేట ఎస్పీ డాక్టర్ జి. వినీత్ ప్రజాదరణతో ముందుకెళ్తున్న ఎన్డీయే కూటమి బ్రహ్మాసముద్రం లో వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం జోరు. అభివృద్ధిని చూడండి శ్రీనివాసవర్మను గెలిపించండి అనంతలక్ష్మి కళాశాలలో ఘనంగా ప్రాజెక్ట్ ఎక్స్‌పో–2026

తలకొండపల్లిలో ఇందిరాగాంధీ వర్ధంతి,సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు*

Select Suryaa Now
తలకొండపల్లిలో  ఇందిరాగాంధీ వర్ధంతి,సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు*

 

తలకొండపల్లి, రంగారెడ్డి : మం

 

డల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం దేశ ఐక్యతకు ప్రతీక, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు, దేశ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ, సర్దార్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ...స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో చెల్లాచెదురుగా ఉన్న 562 సంస్థానాలను ఏకం చేసి నేటి అఖండ భారతాన్ని నిర్మించిన ఘనత సర్దార్ పటేల్ కే దక్కుతుందని కొనియాడారు. దేశంలోని సామాన్య రైతుల కోసం, దేశ ఐక్యత కోసం ఆయన చేసిన కృషి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.

*ఇందిరమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం:* 

బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం ద్వారా దేశాన్ని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా చేసిన ఘనత ఇందిరాగాంధీదే అన్నారు. పేదల సంక్షేమం కోసం 20 సూత్రాల పథకం, దేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన ధీరవనిత ఇందిరమ్మ అని గుర్తు చేశారు. వారి ఆశయాలను కొనసాగించడమే మనం వారికి ఇచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆ దిశగానే పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పడకల్ మాజీ ఎంపిటిసి జోగు రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేణు రెడ్డి, అవంచ నరసింహ రెడ్డి, ఇంద్రకంటి రాఘవేందర్ గౌడ్, అజీజ్, మీసేవ మల్లేష్, నరసింహు, గణేష్, సభావట్ రాజేందర్, శివకుమార్, లక్ష్మయ్య,‌ సంజీవ తదితరులున్నారు.

- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్.