ఫిజియోథెరపీ సేవల విస్తరణపై చర్చ
*చౌటుప్పల్, మేజర్ న్యూస్:* సహస్ర ఫిజియోథెరపీ రిహబిలిటేషన్ సెంటర్ అధినేత, ఫిజియోథెరపిస్టుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆస లక్ష్మి నర్సింహులును ఫిజియోథెరపిస్ట్ డా. గుండెబోయిన రమేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ సేవల విస్తరణ, నూతన చికిత్సా విధానాలు, ప్రజల్లో అవగాహన పెంపుపై చర్చించారు. అనంతరం 'టైమ్ ఆఫ్ ఫిజియో' మ్యాగజైన్‌ను ఆయనకు అందజేశారు.