అనంతలక్ష్మి కళాశాలలో ఘనంగా ప్రాజెక్ట్ ఎక్స్‌పో–2026
అనంతపురం విద్య, మేజర్ న్యూస్ :-అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఎక్స్‌పో–2026 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ఎం. అనంతరాముడు, వైస్ చైర్మన్ ఎం. రమేష్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారని ప్రిన్సిపాల్ డా. కుటాల శ్రీనివాసులు తెలిపారు.
ఈ ప్రదర్శనలో వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన 189 వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు తమ ప్రాజెక్టుల పనితీరు, ఉపయోగాలు, సామాజిక ప్రయోజనాలను వివరించగా, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా చైర్మన్ అనంతరాముడు మాట్లాడుతూ.. విద్యార్థులు పుస్తక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఇలాంటి ప్రదర్శనలు సృజనాత్మకత, సమస్యల పరిష్కార సామర్థ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని వైస్ చైర్మన్ రమేష్ నాయుడు పేర్కొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..