కార్మికులకు 8 గంటల పని దినాన్ని చట్టంగా తెచ్చింది ఏఐటీయూసీ
పామూరు, మేజర్ న్యూస్ : కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడి 8 గంటల పని దినాన్ని చట్టబద్ధం చేసిన ఘనత ఏఐటీయూసీదేనని సీపీఐ మండల కార్యదర్శి పాలపర్తి మస్తాన్‌రావు అన్నారు. పామూరు, కందుకూరు రోడ్డులో శనివారం ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకుడు ఇర్రి వెంకటరెడ్డి ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మస్తాన్‌రావు మాట్లాడుతూ కార్మికులకు ఏఐటీయూసీ నిరంతరం అండగా ఉంటుందన్నారు. అనంతరం కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆకుల మోహన్‌రావు, సూరిబాబు, కిషన్‌సింగ్, సురేష్, దేవకుమార్, మల్లికార్జున, నారాయణరెడ్డి, గుండ్ల ఆంజనేయులు, నారాయణ, జి.వెంకటనారాయణ, ఎస్.కె.బాబు, ఏ.ఫ్రాన్సిస్, శ్రీనివాసులు, ఏ.వి.హరికృష్ణ, బుడిగి దుర్గాప్రసాద్, బి.మాలకొండయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.