గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బస్సులు ఏర్పాటు చేయాలి
* చేవెళ్ల డిక్లరేషన్‌ను అమలు చేయాలని బీజేపీ ఎస్టీ మోర్చా తీర్మానం
కడ్తాల్, రంగారెడ్డి
కడ్తాల్ మండలం మైసిగండిలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఉదయ్‌పూర్ ఎంపీ మన్నాలాల్ రావత్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, బీజేపీ నేత తల్లోజు ఆచారి,బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి కుమార్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారుల సౌకర్యం కల్పించాలని, బస్సులను ఏర్పాటు చేయాలని నాయకులు తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే చేవెళ్ల డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.గిరిజనులు బీజేపీ పార్టీకి పట్టుకొమ్మలని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.