దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం
దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం
మంత్రి శ్రీధర్ బాబు
* రంగంలో పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మివి
మహేశ్వరం: దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం శంషాబాద్ జిహెచ్ఎంసి లోని తుక్కుగూడ 67 డివిజన్ రావిరాల్లో ఫ్యాబ్ సిటీ లో తయారీ కేంద్రం మివి ఉత్పత్తి కార్యకలాపాలకు మద్దతుగా నిలవడమే కాకుండా, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో విస్తరిస్తున్న తరుణంలో దేశీయ తయారీ సామర్థ్యాలను పెంపొందించడంపై కంపెనీకి ఉన్న ప్రత్యేక దృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది
భారతీయ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ 'మివి', అవిశాఖాకరన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నూతన తయారీ కేంద్రాన్ని శనివారం అధికారికంగా ప్రారంభించింది. భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీని ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మివి ప్రయాణంలో ఈ ప్లాంట్ ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మివి ఈ పెట్టుబడి పెట్టింది. భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిస్తూ, 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' ఆశయాలకు అనుగుణంగా దేశీయ వినియోగదారుల కోసం భారతదేశంలోనే ఉత్పత్తులను తయారు చేయడమే ఈ విస్తరణ ముఖ్య ఉద్దేశం.
గడిచిన పదేళ్ల కాలంలో మివి కేవలం ఆడియో బ్రాండ్‌గానే కాకుండా, సొంతంగా ఉత్పత్తులను సాంకేతికతను అభివృద్ధి చేసే స్థాయికి ఎదిగింది. ఇటీవలే 'మివి వన్ 5జి'తో స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి కూడా అడుగుపెట్టింది.కంపెనీ తన సొంత సాంకేతికతతో '3డి స్టేజ్', 'మివి ఏఐ' వంటి ఇన్నోవేషన్లను రూపొందించింది.
హైదరాబాద్‌లోని ఈ నూతన ప్లాంట్ నెలకు 5 లక్షల ఇయర్‌బడ్స్, 75,000 సౌండ్బార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఈ కేంద్రం ద్వారా సుమారు 2,500 మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. తద్వారా స్థానిక యువతకు అవకాశాలు కల్పిస్తూనే, దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అవసరమైన మానవ వనరులను మివి బలోపేతం చేస్తోంది.ఆడియో ఉత్పత్తుల పరిధి దాటి స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ మార్కెట్లోకి విస్తరిస్తూ అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడడమే మివి తదుపరి వృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. ** ఈ సందర్భంగా మివి సహ వ్యవస్థాపకురాలు మిథులా దేవభక్తుని మాట్లాడుతూ.. "భారతదేశంలో మేము ఉత్పత్తులను ప్రారంభించి పదేళ్లు పూర్తయిన శుభసమయంలో ఈ ప్లాంట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడే సాంకేతికతను, ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని మేము ఎప్పుడూ నమ్ముతాము. రాబోయే రోజుల్లో మా సొంత సాంకేతికతపై మరింత పెట్టుబడి పెడుతూ, భారతదేశంలో తయారీ రంగాన్ని మరింత విస్తరిస్తాము" అని తెలిపారు.
** మివి సహ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ కందుల మాట్లాడుతూ.. "గత పదేళ్లలో భారతదేశంలో ఉత్పత్తులు, సాంకేతికత మరియు తయారీ సామర్థ్యాలను పెంపొందించడంపైనే మేము దృష్టి సారించాము. ఈ హైదరాబాద్ ఫెసిలిటీ ప్రారంభం ఆ దిశగా పడిన మరో కీలక అడుగు. ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా భారత్ ఎదిగేందుకు ఉన్న సామర్థ్యంపై మాకున్న నమ్మకానికి ఇది నిదర్శనం. స్మార్ట్ఫోన్లు ఇతర సాంకేతిక విభాగాల్లోకి విస్తరిస్తున్న తరుణంలో, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ కోసం ఆవిష్కరణలపై మా పెట్టుబడులను కొనసాగిస్తాము" అని అన్నారు. గత పదేళ్లుగా మివి పర్సనల్ హోమ్ ఆడియో విభాగాల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇందులో ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్, నెక్ బ్యాండ్లు, హెడ్ఫోన్లు, స్పీకర్లు సౌండ్బార్లు ప్రధానమైనవి. ఉత్పత్తుల అభివృద్ధి, ఆర్ అండ్ డి హైదరాబాద్‌లోని మౌలిక వసతులతో కూడిన తయారీ వ్యవస్థపై కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ కార్యక్రమంలో అనుదీప్ దురిశెట్టి జాయింట్ సెక్రటరీ, ఐటీఈ సీ (సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్) శాఖ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె శశాంక ,పొన్నూరు ఎమ్మెల్యే నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
పాల జనార్ధన్, మేజర్ న్యూస్