BREAKING
బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు* ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లెలో టీడీపీ ప్రచారం దేశ ఐక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి గుండెపోటుతో యువకుడు మృతి -- కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, గడ్డ మణుగు రవికుమార్ మెదక్ జిల్లాలో మనోహరాబాద్ ఒక్కటే కరువు పీడిత మండలం గ్రామానికి మౌలిక వసతులు సమకూరుస్తా -- స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చాట్రాతి ప్రసాద్ గుమ్మేపల్లిలో జోరందుకున్న సైకిల్ ప్రచారం – అభ్యర్థులకు ప్రజల మద్దతు కోరిన నాయకులు* రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌లో మెదక్ విద్యార్థినికి ప్రథమ స్థానం ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్* * రెండు తుపాకులు, 37 ఇనుప గుండ్లు స్వాధీనం… వన్యప్రాణుల మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు-సీఐ నాగరాజు, ఎస్సై రాజేష్ కుమార్..* పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి బ్రిడ్జి నిర్మాణానికి మట్టి నమూన సేకరణ... మట్టి నమూన పనుల పరిశీలిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు...

సేవే లక్ష్యం అభివృద్ధి అభివృద్దే మా విధానం.

Select Suryaa Now
సేవే లక్ష్యం అభివృద్ధి అభివృద్దే మా విధానం.

కూటమితోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యం.

చెప్పిన పని చేసిన ఘనత చంద్రబాబు దే.


ఏళ్ల తరబడి  పరిష్కారం కానీ సమస్యకు పరిష్కారం చూపిన కూటమి ప్రభుత్వం.

కూటమి జెడ్పిటిసి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలి.

గొడ్డలి పార్టీ మాటలను నమ్మొద్దు.

దర్శి జడ్పిటిసి కూటమి అభ్యర్థి లక్ష్మీ తాయారును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి 
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

సూర్య న్యూస్ దర్శి. సేవే లక్ష్యం అభివృద్ధి విధానంగా కూటమి ప్రభుత్వ పాలన ముందుకు సాగుతుందని, నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కూటమి జడ్పీటీసీలను అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు.
కూటమి జడ్పిటిసి జనసేన అభ్యర్థి వరికూటి లక్ష్మీ తయారు విజయాన్ని ఆకాంక్షిస్తూ దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, జనసేన జిల్లా నాయకులు వరికూటి నాగరాజు శనివారం  దర్శి మండలంలోని లంకోజినపల్లి , తూర్పు వెంకటాపురం, గణేశ్వర పురం, రామచంద్రాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని దర్శి జడ్పిటిసి జనసేన అభ్యర్థి వరికూటి లక్ష్మి తాయారు ని గెలిపించవలసినదిగా ఓటర్లు ను కోరారు.
దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి బలోపేతం కావాలి.
రాబోయే జడ్పిటిసి ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించి, దర్శి అభివృద్ధి ప్రస్థానానికి మీ సంపూర్ణ మద్దతు, ఆశీస్సులు అందించాలని సవినయంగా కోరుతున్నాను గొట్టిపాటి లక్ష్మీ కోరారు. గొడ్డలి పార్టీ నాయకులు మాటలు నమ్మి మరొకసారి మోసపోవద్దని ఓటర్లకు డాక్టర్ లక్ష్మి సూచించారు. రెండున్నర సంవత్సరాల కూటమిపాలన లో సంక్షేమం అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని డాక్టర్ లక్ష్మీ కోరారు.

ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ ప్రస్తుత చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మున్సిపల్ నూతన చైర్మన్ దారం సుబ్బారావు, దర్శి ఎంపీపీ అభ్యర్థి పోకూరి నారాయణస్వామి, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, దర్శి పట్టణ జనసేన అధ్యక్షులు చాతరాసి కొండయ్య, ఉల్లి బ్రహ్మయ్య పసుపులేటి చిరంజీవి, లంకోజనపల్లి, వెంకటాపురం, గణేశ్వర పురం, రామచంద్రాపురం గ్రామ టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.