నువ్వురుపాడులో టిడిపి అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలం నువ్వురుపాడు ఎంపీటీసీ పరిధిలోని నువ్వురుపాడు గ్రామంలో మండల జడ్పిటిసి, సెగ్మెంట్ ఎంపీటీసీ తెలుగుదేశం అభ్యర్థులు డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి, షేక్ ఖాజావలి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులతో కలిసి డాక్టర్ శశిదర్ రెడ్డి,ఖాజావలి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అందరూ తమను ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని వారు అభ్యర్థించారు. తమను గెలిపిస్తే ఖచ్చితంగా అటు మండల ఇటు సెగ్మెంట్ అభివృద్ధికి అందరికీ కనీస వసతులు చేకూర్చేందుకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో తాము తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని వారు పేర్కొన్నారు. అభివృద్ధిప్రధాత మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండదండలతో ఆత్మకూరు మండలాన్ని,నువ్వురుపాడు ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల్లో ముమ్మరంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధతో చేపడతామని, వీధుల్లో సిమెంట్ రోడ్లు వేయిస్తామని,సైడ్ కాలువలు నిర్మిస్తామని, అందరికీ త్రాగునీరు పుష్కలంగా అందించేలా ప్రత్యేక దృష్టితో కృషి చేస్తామని వారు పేర్కొంటూ ఓటర్లను విజయం చేకూర్చాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. వారు ఇంటింటా ప్రచారం నిర్వహించగా అందరూ వారిని ఆశీర్వదించి తమ మద్దతు తెలుపుతున్నారు.