BREAKING
ముందస్తు గుర్తింపే రొమ్ము క్యాన్సర్‌కు సరైన రక్ష: కిమ్స్ వైద్య నిపుణులు కార్మికులకు 8 గంటల పని దినాన్ని చట్టంగా తెచ్చింది ఏఐటీయూసీ దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం సేవే లక్ష్యం అభివృద్ధి అభివృద్దే మా విధానం. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బస్సులు ఏర్పాటు చేయాలి మర్రిపాడు మండలమంటే నాన్నకు అమితమైన ప్రేమ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్ దానిమ్మ తోటల్లో ఎండు తెగులుపై శాస్త్రవేత్తలు పరిశీలన దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధితో పాటు పచ్చదనానికి పెద్దపీట నువ్వురుపాడులో టిడిపి అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ చేయూత గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే మా లక్ష్యం: వైసీపీ నాయకుడు గడ్డం రంజాన్ అందరూ ఆశీర్వదించి విజయం చేకూరిస్తే ఆత్మకూరు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా సెగ్మెంట్లో అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు తనకు విజయ సోపానాలు - టిడిపి ఎంపిటిసి అభ్యర్థి ఖాజావలి

ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలి

Select Suryaa Now
ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలి

పార్వతిపురం, సూర్య : సాలూరు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె. సహదేవ సిబ్బందికి ఆదేశించారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం మన్యం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె. సహదేవ పార్వతిపురం మండల పరిధిలోని పి.కొనవలస చెక్‌పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు వద్ద నిర్వహిస్తున్న తనిఖీ ప్రక్రియను పరిశీలించి, అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం తరలింపు, ఇతర నిబంధనలకు విరుద్ధమైన కార్యకలాపాలకు అవకాశం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ సిబ్బందితో మాట్లాడి తనిఖీల నిర్వహణ తీరును సమీక్షించారు. ముఖ్యంగా అనుమానాస్పదంగా కనిపించే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి వాహనాన్ని తనిఖీ చేయకుండా విడిచిపెట్టకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మద్యం లేదా ఇతర నిషేధిత వస్తువుల రవాణా జరగకుండా నిరంతరం నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, చెక్‌పోస్టు వద్ద తనిఖీలను నిరంతరం కొనసాగిస్తూ అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.