ఉపాధ్యాయ డిమాండ్ల సాధనకు పి ఆర్ టి యు పోరాటం
పాలమూరు మేజర్ న్యూస్ -
- ఉపాధ్యాయ డిమాండ్ల సాధనకు పి ఆర్ టి యు టి ఎస్ రాజీ లేని పోరాటం చేస్తుందని మహబూబ్ నగర్ జిల్లా పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షులు జి.మదన్ మోహన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జి.సుధాకర్ రెడ్డి, అధ్యక్షులు వి.బుచ్చా రెడ్డి లు ఉద్ఘాటించారు. పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా శాఖ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండవ సారి ఘన విజయం సాధించిన తదుపరి తొలిసారిగా దేవరకద్ర మండల పర్యటనకు వచ్చిన జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి,అధ్యక్షులు బుచ్చా రెడ్డిలను పి ఆర్ టి యు టి ఎస్ మండల శాఖ అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా బాధ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి పెద్ద ఉపాధ్యాయ ఉపాధ్యాయ సంఘంగా గుర్తింపు పొందిన పి ఆర్ టి యు ఉపాధ్యాయ సమస్యల సాధనకు అలుపెరగని కృషి చేస్తుందని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త పి ఆర్ సి సాధన... సి పి ఎస్ రద్దు... పాత పెన్షన్ పునరుద్దరణయే ప్రధాన డిమాoడ్లుగా పి ఆర్ టి యు టి ఎస్ ఉద్యమిస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనయే లక్ష్యంగా పి ఆర్ టి యు పనిచేస్తుoదని అన్నారు. పి ఆర్ టి యు చెప్పింది చేస్తుంది...చేసింది చెప్తుందని అన్నారు. అందుకు గత పి ఆర్ సి లో 30 శాతం ఫిట్ మెంట్ సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ ను సాధించిన ఘనత పి ఆర్ టి యు కు మాత్రమే దక్కుతుందని అన్నారు.ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి ఆకర్షనీయమైన ఫిట్ మెంట్ తో పి ఆర్ సి ని సాధిస్తామని ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన సి పి ఎస్ ను రద్దు చేసేంత వరకు పి ఆర్ టి యు పోరాటం చేస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించేది ఒక్క పి ఆర్ టి యు కు మాత్రమే సాధ్యమవుతుoదని అన్నారు. కాగా అంతకు ముందు జడ్పీ హెచ్ ఎస్ కోయిల్ సాగర్ లో జరిగిన ఉద్యోగ విరమణ సభలో రామకృష్ణా రెడ్డి కవిత దంపతులను ఘనంగా సన్మానించి అభినందించారు. పాల్గొని సందర్బంగా వై. వి. రావు, అరుణ దేవి దంపతులను ఘనంగా సన్మానించారు. కాగా జిల్లా బాధ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కోయిల్ సాగర్ జి హెచ్ యం కె.రమేష్, పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కమిటీ సభ్యులు లయన్ అశ్విని చంద్రశేఖర్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్ష కార్యదర్శులు రఘువర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు ప్రవీణ్ కుమార్,అబ్దుల్ ఖాదర్, సుందర్,మాధురి, గణేష్, కె.మురళీధర్, పురేందర్ రెడ్డి ,నాగార్జున రెడ్డి, సుదర్శన్, రాఘవేంద్ర స్వామి, అనంత రెడ్డి, రుషి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్-మహబూబ్ నగర్