దళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ సుంకె ప్రసాద్
యాదగిరిగుట్ట, మేజర్ న్యూస్:ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి రైతులు మోసపోవద్దని సాధువెల్లి సర్పంచ్ సుంకె ప్రసాద్ సూచించారు.శనివారం సాధువెల్లి గ్రామంలో అజీవా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంస్థ డైరెక్టర్ కోక్కలకొండ అరుణతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటుధర కల్పించడమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల లక్ష్యమన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతుధర చెల్లించనున్నట్లు వెల్లడించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర పొందాలని కోరారు. దళారుల మాయమాటలకు మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఈఓ కొక్కలకొండ మహేష్, ఉపసర్పంచ్ శ్రీకాంత్ గౌడ్,పీఏసీఎస్ డైరెక్టర్లు ఎడ్ల రామ్‌రెడ్డి,అండమ్మ,వార్డు సభ్యులు రామకృష్ణ,గణేష్ గౌడ్,లావణ్య శ్రీను,బాలరాజు గౌడ్,మాధవి సిద్ధులు, కుమారస్వామి, మణెమ్మ యాకయ్య,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రవికుమార్,రైతులు పాల్గొన్నారు.