BREAKING
గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు జైలు శిక్ష పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలి -- కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అనాథాశ్రమంలో చిన్నారి మొదటి పుట్టినరోజు.. అన్నదానంతో వేడుకలు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కత్తిరి నాగమణి ఇంటింటా ప్రచారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల జట్టుకు నెల్లూరు జోన్ క్రికెట్ టైటిల్ బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలి... అభివృద్ధి బాటలో కూటమి.. గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం... మామిడి సుమతిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: బీజేపీ నాయకుల పిలుపు. ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి వైసిపి ఎంపిటిసి అభ్యర్థి ముత్యాలయ్య రుద్రకోటలో వైకాపా నుండి టిడిపిలో చేరిన 20 కుటుంబాలు. కరటంపాడులో వైసీపీ నేతల ప్రచారం దళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ సుంకె ప్రసాద్ ఉపాధ్యాయ డిమాండ్ల సాధనకు పి ఆర్ టి యు పోరాటం విద్యార్థినిపై దాడి చేయడం అత్యంతఅమానుషం

కుష్టు వ్యాధి సర్వేను పరిశీలించిన స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ విజయనిర్మల

Select Suryaa Now
కుష్టు వ్యాధి సర్వేను పరిశీలించిన స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ విజయనిర్మల

 

 

• నాలుగు లక్షల 25 వేల జనాభాకు సర్వే.. వ్యాధిగ్రస్తులను తొలిదశలో గుర్తించడమే లక్ష్యం

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :

 జిల్లాలో నిర్వహిస్తున్న జాతీయ కుష్టు వ్యాధి నివారణ సర్వే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాతీయ కుష్టు నివారణ స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ విజయనిర్మల శనివారం పరిశీలించారు. ఇందులో భాగంగా జైపూర్, హాజీపూర్, నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలు చేపడుతున్న ఇంటింటి సర్వే తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా డాక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు నాలుగు లక్షల 25 వేల జనాభాకు కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు సర్వే కొనసాగుతుందని వెల్లడించారు. ఆశా ఆరోగ్య కార్యకర్తల బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ కుష్టు వ్యాధి అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నట్లు వివరించారు.

కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, అవగాహన కల్పించడంతో పాటు అనుమానిత కేసులను గుర్తించి తదుపరి వైద్య పరీక్షలు నిర్వహించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు.

సర్వేలో భాగంగా ఆశా కార్యకర్తలు సందర్శించిన ఇళ్లను పరిశీలించి, వారు గుర్తించిన అనుమానిత కేసుల వివరాలను సమీక్షించారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అందిస్తున్న సేవలు, సర్వే నిర్వహణ తీరు, కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విధానంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, సీహెచ్‌ఓ ధూప్‌సింగ్, కుష్టు వ్యాధి కోఆర్డినేటర్ ప్రకాష్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.