విజిలన్స్ అవగాహన సదస్సు
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు. శ్రీ. కట్టా.వేంకటేశ్వర్లు గారు మరియు ACB/C.I T.V. శ్రీనివాసరావు గారు, ACB/C.I/ రమేష్ బాబు గారు, విజులెన్స్ C.I, శ్రీ. B.T. నాయక్ గారి ఆద్వర్యంలో విద్యుత్ భవనంలో విజిలన్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ సంస్థల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఉద్యోగులకు అవినీతి నిర్మూలన, నైతిక విలువలు, పారదర్శకత, సమగ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్.ఇ గారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి నిజాయితీగా, నైతిక విలువలకు కట్టుబడి, పారదర్శకతతో విధులు నిర్వహించాలని సూచించారు. అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమగ్రతతో కూడిన సేవలందిస్తూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని విద్యుత్ ఉద్యోగులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెక్నికల్) శ్రీమతి పద్మావతి గారు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారు, విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు