BREAKING
బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది ఆశీర్వదించండి,గెలిపించండి జిల్లా వాలీబాల్‌ విజేతగా ఆదర్శ పాఠశాల గుడ్లవల్లేరు మండలంలో పార్టీల ప్రచార హోరు శ్వాసపై ధ్యాస..మనసుకు ప్రశాంతత! ఎంఈఓ కర్ణాకర్ రెడ్డి సేవలు ఎనలేనివి... ఎన్నికల విధులకు 1,100 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కరువు మండలాలు డిక్లేర్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మిర్యాలగూడకు చేరిన తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర బీసీలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించడం లేదు – తీన్మార్ మల్లన్న బియ్యం ధరలపై కీలక నిర్ణయం! భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం.. కన్నీరు పెడుతున్న రైతన్న పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు బిరదవోలులో సుమలత ప్రచార జోరు .. అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు! ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హరీష్ వర్ధన్ ముదిరాజ్....… కూటమి విజయానికి సాయిబాబా సన్నిధిలో హోమం

భట్టిప్రోలు గ్రామీణ బ్యాంకులో నిజాయితీ ప్రతిజ్ఞ

Select Suryaa Now
భట్టిప్రోలు గ్రామీణ బ్యాంకులో నిజాయితీ ప్రతిజ్ఞ

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పరిష్కరించుకుని భట్టిప్రోలు గ్రామీణ చైతన్య బ్యాంకు వద్ద శనివారం బ్యాంకు సిబ్బంది మరియు ఖాతాదారులు నిజాయితీ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ జంపని రామారావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించు విజిలెన్స్ అవేర్నెస్ లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. మన దేశ ఆర్థిక రాజకీయ మరియు సామాజిక పురోగతికి ప్రధాన అడ్డంకులలో అవినీతి ఒకటని, అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం, పౌరులు మరియు ప్రైవేట్ రంగం సమైక్యంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని, అన్నివేళలా అత్యున్నత ప్రమాణాలతో కూడిన నీతి నిజాయితీలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మద్దతు ఇవ్వాలని నమ్ముతున్నట్లుగా అందరితో ప్రతిజ్ఞ చేపించారు. దైనందిన జీవితంలో ప్రతి పనిని నిజాయితీగా, నీతి నియమాలకు లోబడి నిర్వహిస్తాను లంచం తీసుకోను లంచం ఇవ్వను అన్ని పనులను నిజాయితీగా మరియు పారదర్శకమైన పద్ధతిలో చేస్తాను ప్రజాప్రయోజనాల కోసం పనిచేస్తాను నా వ్యక్తిగత ప్రవర్తనలో నిజాయితీని ప్రదర్శిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాను ఎక్కడైనా ఎప్పుడైనా అవినీతి నా దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారులు తెలియజేస్తాను. అంటూ సిబ్బంది మరియు ఖాతాదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎం శివశంకరరావు, పీవీ రాఘవరావు, కె రామకృష్ణ జి సుబ్బారావు మరియు పలువురు బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు.