BREAKING
నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్

కరువు మండలాలు డిక్లేర్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

Select Suryaa Now
కరువు మండలాలు డిక్లేర్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

కొల్చారం;కరువు మండలాల డిక్లరేషన్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దాంతో జిల్లా రహితంగానికి నష్టం వాటిల్లుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కొల్చారం మండలంలోని చిన్నగనాపూర్ గ్రామంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్థానిక సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి సొసైటీ చైర్మన్  మంద నాగులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో కేవలం మనోహరాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి 20 మండలాలను కరువు మండలాలుగా డిక్లేర్ చేయలేదని అన్నారు. కౌడిపల్లి నర్సాపూర్ చిలాప్చేడ్ మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ కేవలం ఒకే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో వివక్ష ఎందుకన్నారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. కరువు మండలాలుగా ప్రకటించడంతో రైతంగానికి సబ్సిడీపై విత్తనాలు పశుగ్రాసం వస్తుందన్నారు. ఉపాధి హామీ పని లభిస్తుందన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు వస్తాయన్నారు. ప్రభుత్వం వరిపంటలు  సాగు చేయవద్దని క్రాఫ్ట్ హాలిడే ప్రకటించడంతో రైతాంగం ఏ విధంగా జీవిస్తారని అన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు 30 వేల రూపాయలు ఇవ్వాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా, ఉప సర్పంచ్, తహసిల్దార్ శ్రీనివాస్ చారి, సి డి సిమాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ పిల్లల రాజాగౌడ్, సొసైటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి,బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సొసైటీ డైరెక్టర్ పుల్లబోయిన మల్లేష్, సీఈఓ చందాపురం సత్యనారాయణ రెడ్డి, తమ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.