బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు
జిన్నారం;భారతదేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను బొల్లారం డివిజన్ లో ఘనంగా నిర్వహించారు.డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల మహేందర్ రెడ్డి, స్థానిక బాలాజీ నగర్ వాసుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్బంగా గుండ్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలల చాటిచెప్పిన ఉక్కు మహిళా ఇందిరాగాంధీ అని ఈ సందర్బంగా కొనియాడారు.ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఓడుదోడుకులను ఎదుర్కొని శక్తివంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది అని అన్నారు.భారతదేశ మొట్ట మొదటి మహిళా ప్రధానిగా భాద్యతలు స్వీకరించినా మహిళా ఇందిరాగాంధి అని గుర్తు చేసారు.ఇందిరాగాంధీ ప్రధానిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో విప్లవాత్మమైన మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. భారతదేశ ప్రధానిమంత్రిగా రెండుసార్లు భాద్యతలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిడు, సుదర్శన్ రెడ్డి, ఆంజనేయులు, సందీప్ రెడ్డి, ఆదర్శ్,యువరాజ్, నగేష్, రాకేష్, గోకుల్ తదితరులు పాల్గొన్నారు.