టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం
సిఎస్ పురం,మేజర్ న్యూస్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమపథకాలు అదేవిధంగా ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి చేస్తున్న కృషిని వివరిస్తూ మండల టిడిపి జడ్పిటిసి అభ్యర్థి గుంటిమడుగు శ్రీనివాసవర్మ శనివారం మండలంలోని పెదరాజుపాలెం పంచాయతీ పరిధిలో పర్యటించి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలును ప్రజలకు వివరించి ఆశీర్వదించాలని కోరారు.ఈసందర్భంగా మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా జడ్పిటిసిగా పోటీచేస్తున్నట్లు సమాజసేవలు,ప్రజాసేవలో తనవంతు ప్రజలకు సేవచేయడానికి అవకాశం కల్పించాలని సైకిల్ గుర్తుమీద ఓటువేసి గెలిపించాలని స్థానికులను అభ్యర్ధించారు. ఈకార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు బొబ్బూరి రమేష్,ఎంపిపి అభ్యర్థి డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య,జడ్పిటిసి అభ్యర్థి గుంటిమడుగు శ్రీనివాసవర్మ,ఎంపిటిసి డి.లక్ష్మీదేవి, నాయకులు యన్.సి.మాలకొండయ్య, మన్నేపల్లి శ్రీనివాసులు, ఏ.రామకృష్ణంరాజు,దర్శిఆదినారాయణ,నాగరాజు,పలువురు నాయకులు,స్థానికులు పాల్గొన్నారు.