రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:- అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన క్రూర దాడిని ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ తీవ్రంగా ఖండించారు. పాఠశాలల్లో బాలికలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యాలయాలు భయాందోళనలకు కాకుండా విద్యాభ్యాసానికి నిలయాలుగా ఉండాలని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్