మాదాపూర్ ఆదిత్య నగర్‌కు బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలనీ.... ఎమ్మెల్యే గాంధీకి కాలనీ వాసుల వినతి
మాదాపూర్,మేజర్ న్యూస్ : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గాంధీకి కాలనీ వాసులు కోరారు. ఈ మేరకు సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఎమ్మెల్యే గాంధీని శనివారం వివేకానంద నగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే గాంధీ విశేష కృషి చేశారని, మౌలిక వసతుల కల్పనకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే చిన్నారుల విద్య, పోషణ కోసం అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఆదిత్య నగర్ కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖాన, చిన్నారుల సంక్షేమం కోసం అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ కాలనీ వాసులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.