BREAKING
మాదాపూర్ ఆదిత్య నగర్‌కు బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలనీ.... ఎమ్మెల్యే గాంధీకి కాలనీ వాసుల వినతి జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ 'డ్రాగన్'లో మరో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్: నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంట్రీ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర

కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్

Select Suryaa Now
కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి  -- తెలంగాణ రాష్ట్ర గౌరవ  హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్

మెదక్ ; కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలనీ తెలంగాణ రాష్ట్ర గౌరవ  హై కోర్టు జర్జి ప్రవీణ్ కుమార్ అన్నారు.శనివారం నర్సాపూర్ లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.నర్సాపూర్ కోర్టు ప్రాంగణానికి చేరుకున్న గౌ హై కోర్టు జర్జి కి పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
కోర్టు ప్రాంగణంలో గౌ హై కోర్టు జర్జి మొక్కను నాటి ,నీటిని పోశారు .అనంతరం కోర్టు ప్రాంగణంలో సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గౌ; హై కోర్టు జర్జి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...  కక్షిదారులకి సత్వరమే న్యాయం అందాలన్నారు . న్యాయవాది వృత్తిలో ఉన్న న్యాయవాదులందరూ ఈ ధర్మాన్ని పాటించి, అన్యాయాన్ని సహించొద్దన్నారు. బారసోసియేషన్, బెంచ్ అన్నదమ్ముల అనుబంధాన్ని కొనసాగించాలన్నారు. డ్రైవర్లు డ్రెస్ కోడ్ను పాటించి, క్రమశిక్షణగా మెదగాలన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, జీవితంలో అమ్మను మించిన గురువు  లేరన్నారు. కక్షిదారుల సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించాలని నిష్పక్షంగా న్యాయం చేయాలన్నారు.ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి మెదక్ జిల్లా న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ.. నర్సాపూర్ పరిసర ప్రాంత ప్రజలకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు. జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి త్రాగునీటి ఇబ్బంది తీర్చాలని, కక్షిదారులకు మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా అతి తక్కువ ధరలో భోజనం ఏర్పాటు చేయించాలని జిల్లా కలెక్టర్ కు వివరించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర గౌరవ హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ గారిని జిల్లా జడ్జీలు, బారసోసియేషన్ సభ్యులు మెమెంటో అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో .జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ , ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,  శుభవల్లి  అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి మెదక్, రూబీనా ఫాతిమా సీనియర్ సివిల్ జడ్జి  సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అతరిటీ మెదక్ , శ్రీ సాయి ప్రభాకర్ మెదక్  మొబైల్ కోర్ట్, smt సుచరిత జూనియర్ సివిల్ జడ్జి అల్లదుర్గ, M. హేమలత జూనియర్ సివిల్ జడ్జి నర్సాపూర్ ,బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ,బార్ మెంబర్స్ , వివిధ అడ్వకేట్ బార్ అసోసియేషన్స్ తదితరులు పాల్గొన్నారు.