ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు;పటాన్‌చెరు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పేద,మధ్యతరగతి ప్రజలకు సైతం నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో మరిన్ని ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శనివారం పటాన్‌చెరులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పటాన్‌చెరు పారిశ్రామికంగా, జనాభా పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులు ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు.వైద్య సేవలు కేవలం ఆర్థిక స్థోమత కలిగిన వారికే పరిమితం కాకుండా పేదలకు కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రి యాజమాన్యం నాణ్యమైన వైద్య సేవలతో పాటు పేదలకు అందుబాటు ధరల్లో చికిత్స అందించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ వెంకట్ అలపాటి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్‌పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, పృథ్వీరాజ్,మాజీ ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.