BREAKING
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న మన పేగుల్లో కోట్లాది మంచి బ్యాక్టీరియా.. వాటిని సురక్షితంగా కాపాడుకోవడం ఎలా బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు

Select Suryaa Now
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు

కొండాపూర్‌;కొండాపూర్‌ మండల పరిధిలోని మారేపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు, జాప్యం లేకుండా వడ్లను కొనుగోలు చేస్తామని సొసైటీ చైర్మన్‌ రాజు తెలిపారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, ధాన్యం కొనుగోళ్లను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.మారేపల్లి సొసైటీ పరిధిలోని గ్రామాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ఆరబెట్టుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు, ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.దళారులను నమ్మి మోసపోవద్దు రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రాజు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందుతుందని తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో సొమ్ము సకాలంలో జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే అక్కడి అధికారులను, సొసైటీ పాలకవర్గాన్ని సంప్రదించాలని సూచించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడతామని మారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు స్పష్టం చేశారు.