భక్తిశ్రద్ధలతో శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ :శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దర్శనార్థం చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఉదయం హైదరాబాద్ బేగంపేట నుంచి భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. అయ్యప్ప స్వామి నామస్మరణలు, శరణుఘోషల మధ్య గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్రలో దివంగత వేణుగోపాల్ గురుస్వామి ను స్మరించుకుంటూ .. బుచ్చిబాబు గురుస్వామి, సోములు యాదవ్ గురుస్వామి, దశరథ్ గురుస్వామి, అనిల్ కుమార్ జేఎస్ఆర్ గురుస్వామి, హంటర్ శివ, టేకుమల్ సాయి గురుస్వామి, ప్రశాంత్ కత్తి స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని, భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కలగాలని గురుస్వాములు ఆకాంక్షించారు.