బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత
రాయపర్తి , మేజర్ న్యూస్, మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాషబోయిన సమ్మయ్య తల్లి భాషబోయిన ఐలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆదివారం బాధిత కుటుంబాన్ని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు లేతా కుల రంగారెడ్డి పరామర్శించారు. అనంతరం ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ తరుపున ఎస్ఆర్ఆర్ చైర్మన్, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పంపించిన 3000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు.మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు దొకుడు దేవేందర్,పార్టీ ముఖ్య నాయకులు దొంతరబోయిన యాదగిరి, బక్క ఎల్లయ్య, భాషబోయిన ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;సురేష్, రాయపర్తి వరంగల్ జిల్లా