BREAKING
బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత గుజరాత్ ఐక్యత దినోత్సవ వేడుకల్లో నల్లగొండ సర్పంచులు

మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి

Select Suryaa Now
మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి

రవీంద్ర భారతి , మేజర్ న్యూస్ : మాతృమూర్తుల గొప్పతనాన్ని తల్లిప్రేమ ఔన్నత్యాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్న సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ దేవసేన అభినందనీయురాలని 
తెలంగాణ రాష్ట్ర నాట్యమండలి చైర్మన్, హైకోర్టు న్యాయవాది జస్టిస్ తంగిరాల మాధవి దేవి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ‘మాతృదేవోభవ’ కార్యక్రమాన్ని రవీంద్రభారతి సమావేశ మందిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది జస్టిస్ తంగిరాల మాధవి దేవి , హైకోర్టు న్యాయవాది జస్టిస్ జి.శ్రీదేవి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిని మించిన దైవం లేదని స్పష్టం చేశారు. 
గత కొన్ని సంవత్సరాలుగా మాతృమూర్తుల గొప్పతనాన్ని తెలియజేస్తూ.. ప్రతి ఏటా తల్లి పేరిట కార్యక్రమాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు . 
కార్యక్రమంలో నిరూపం సేవా ఫౌండేషన్ అధ్యక్షురాలు కృష్ణకుమారి, సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ దేవసేన పాల్గొన్నారు. సభకు ముందు ప్రముఖ గురువు రేణుక ప్రభాకర్, రాజులపూడి కీర్తన , శిష్య బృందం, సుశీల రాణి, డి.బాల కామేశ్వరరావు
సంగీత నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.