BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

గుజరాత్ ఐక్యత దినోత్సవ వేడుకల్లో నల్లగొండ సర్పంచులు

Select Suryaa Now
గుజరాత్ ఐక్యత దినోత్సవ వేడుకల్లో నల్లగొండ సర్పంచులు

 

మిర్యాలగూడ, మేజర్ న్యూస్:                                   గుజరాత్ లో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ 2026 లో నల్గొండ జిల్లాకు చెందిన పలువురు గ్రామ పంచాయతీ సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా జిల్లా నోడల్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిపురస్కరించుకొని భారత ప్రభుత్వం 2014 అక్టోబర్ 31 నుంచి జాతీయ సమైక్యతా దినోత్సవంగా గుర్తించడం జరిగిందన్నారు. 565 సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేసి భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన వల్లభాయ్ పటేల్ 143 వ జయంతినిపురస్కరించుకొని 2018 అక్టోబర్ 31న వల్లభాయ్ పటేల్ ఐక్యతా చిహ్నమును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికిఅంకితంచేశారన్నారు.ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, నక్సల్ ముక్త్ భారత్ సాధించినందుకు గాను తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యే లు, వివిధ రంగాల నుంచి 15 మందిని జాతీయ ఐక్యతా పరేడ్ 2026 వీక్షణకు ఎంపిక చేయడం జరిగిందన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ 151 వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం గుజరాత్ లోని నర్మదా నది తీరంలో ఉన్న సాదు బెట్ దీవిలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఉత్సవంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల నుంచి వివిధ రంగాలలో (పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్స్, జనరల్ పబ్లిక్, స్టూడెంట్స్) సేవలందిస్తున్న బృందం నర్మదా నది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యామ్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రపంచంలోనే 182 మీటర్ల (597 అడుగులు) పొడవైన అతి పెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మించిన ఐక్యతా ప్రతిమ స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించడం జరిగిందని ఆయన తెలిపారు.గుజరాత్ లో జరిగిన రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ 2026 లో నల్గొండ జిల్లా నోడల్ ఆఫీసర్ మహమ్మద్ అక్బర్ అలీ, నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్సింగు కోటయ్య, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు ఆవుల మాధవి, చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్, మిర్యాలగూడ మండలం జప్తి వీరప్ప గూడెం గ్రామ సర్పంచ్ వెంకటయ్య, మాడ్గులపల్లి మండలం ఇస్కబావిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్లూరి అనిత వెంకట్ రెడ్డి, గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామ సర్పంచ్ జ్ఞానలత, మైనంపల్లి గ్రామ సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్, వెంకటరెడ్డి, జెడ్ ఎస్ పెట్రోల్ బంక్ మేనేజర్ సంధ్యారాణి, పేపర్ ప్రొడక్ట్స్ మేనేజర్ మెండేపార్వతమ్మ, మహాత్మాగాంధీయూనివర్సిటీ సైన్స్ కళాశాల నుంచి కె. తరుణ్ విద్యార్థి, నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎం. సాయి పవన్ విద్యార్థి, కేపీఎం జూనియర్ కళాశాల ఎస్. హర్షిత్, టీజీఎం గుర్రంపాడు ఆర్. చైతన్య తదితరులు పాల్గొన్నారు.