గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్
నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ నియోజకవర్గం మండలంలోని నెమలిమెట్ గ్రామానికి చెందిన మసంపల్లి అంజయ్య కి ఇటీవల గుండె శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ వారి స్వగ్రాహానికి శనివారం వెళ్లి వారిని పరామర్శించి ఈ సందర్భంగా అంజయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. నిరుపేదలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న జిఎంఆర్ ఫౌండేషన్ సేవలను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, నెమలిమెట్ మాజీ సర్పంచ్ సత్యపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, అశోక్, బాగయ్య నరసయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు