BREAKING
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న మన పేగుల్లో కోట్లాది మంచి బ్యాక్టీరియా.. వాటిని సురక్షితంగా కాపాడుకోవడం ఎలా బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం

ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి

Select Suryaa Now
ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి

పటాన్‌చెరు;పటాన్‌చెరు ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్‌ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఆసుపత్రి చైర్మన్ వెంకట్ అలపాటి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు ఆసుపత్రిలోని ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. రోగులకు అందించనున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాల గురించి చైర్మన్ వెంకట్ అలపాటిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పటాన్‌చెరు ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. స్థానికంగానే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు.ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే మా లక్ష్యం: వెంకట్ అలపాటి ఆసుపత్రి చైర్మన్ వెంకట్ అలపాటి మాట్లాడుతూ పటాన్‌చెరు ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యులు, ఆధునిక వైద్య పరికరాలతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరై ప్రోత్సహించిన ఎంపీ రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, దాస్ యాదవ్, ఆసుపత్రి డైరెక్టర్లు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.