BREAKING
అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

Select Suryaa Now
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

పటాన్‌చెరు;విద్యార్థులు,యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లను అలవర్చుకోవాలని పటాన్‌చెరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ సూచించారు.కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్),నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నషాముక్త్ – నైబర్‌హుడ్ యువ పార్లమెంట్,జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.వందేమాతర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి,సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నషాముక్త్ భారత్ అంశంపై నినాదాల రచన పోటీలు నిర్వహించారు.ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ మాట్లాడుతూ యువత సోషల్ మీడియా, మత్తు పదార్థాల ప్రభావానికి లోనుకాకుండా జీవిత లక్ష్య సాధన దిశగా నిరంతరం కృషి చేయాలని సూచించారు.ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ నేత్రావతి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడితే శారీరకంగానే కాకుండా మానసికంగానూ బలహీనపడతారని, తద్వారా జీవితం అస్తవ్యస్తమవుతుందని తెలిపారు.అనంతరం నషాముక్త్ అభియాన్, జాతీయ సమైక్యత ప్రతిజ్ఞలను చేయించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు మెమెంటోలు అందించి అభినందించారు. జాతీయగీతంతో కార్యక్రమం ముగిసింది.కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ప్రొఫెసర్ ఆకుల వెంకటేశం,డాక్టర్ కరుణ కుమారి,డాక్టర్ పూనమ్ కుమారి,అధ్యాపకులు సునీత, స్రవంతి,డాక్టర్ శివదీప్తి,డాక్టర్ పి. సుజాత,షరీఫ్ మియా, డాక్టర్ మంజుశ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు.