BREAKING
-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్

కూటమి విజయానికి సాయిబాబా సన్నిధిలో హోమం

Select Suryaa Now
కూటమి విజయానికి సాయిబాబా సన్నిధిలో హోమం

ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు దంపతుల ప్రత్యేక పూజలు

కూటమి మేయర్‌ అభ్యర్థి శ్రీశిల్పతోపాటు కార్పొరేటర్ల విజయాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు

నగర ప్రజలకు సుఖసంతోషాలు, నగరాభివృద్ధి కోసం స్వామివారికి మొక్కులు

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఘన విజయాన్ని కాంక్షిస్తూ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు దంపతులు శనివారం సంతపేట సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్డీఏ కూటమి మేయర్‌ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్పతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కార్పొరేటర్‌ అభ్యర్థులందరూ అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల ఆధ్వర్యంలో హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, ఆయన సతీమణి నాగ సత్యలత దంపతులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలు నగర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని, నగరం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించారు. రేపు జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి మేయర్‌ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్పతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థులందరూ ప్రజల ఆశీస్సులతో ఘన విజయం సాధించాలని కోరుతూ హోమ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు కుటుంబ సభ్యులు, జనసేన నాయకుడు రియాజ్‌, మేయర్‌ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప కుటుంబ సభ్యులు, కూటమి పార్టీల కార్పొరేటర్‌ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.