BREAKING
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ 'డ్రాగన్'లో మరో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్: నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంట్రీ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని

-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు

పటాన్ చెరువు;తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామ గ్రామానికీ తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆ పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నేనావత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి నెమలికొండ వేణుమాధవ్, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి సిద్ధి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారితో కలిసి శంకర్ నాయక్ విలేకరులతో మాట్లాడారు.ఉచిత విద్య, వైద్యం అందించడం, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం కల్పించడం, సామాజిక న్యాయం సాధించడం లక్ష్యంగా కవితమ్మ ప్రజా పోరాటానికి శంఖారావం పూరించారని అన్నారు. తెలంగాణ రక్షణ సేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ముఖ్యంగా గిరిజనులు, బడుగు బలహీన వర్గాలను పార్టీతో అనుసంధానం చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి నెమలికొండ వేణుమాధవ్‌తో పాటు రాష్ట్ర నాయకులు రూప్‌సింగ్, కల్యాణ్ నాయక్, రవిచంద్ర, అర్చన సేనాపతి, తయితర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కృష్ణారెడ్డి,బస్వరాజ్,ఎర్ధనూరు ఉప సర్పంచ్ పరమేశ్ నాయక్, విశాల్ నాయక్,నవీన్ నాయక్, ప్రకాష్, నర్సింలు,తదితరులు పాల్గొన్నారు.