BREAKING
ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి

పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

Select Suryaa Now
పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ : ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ అక్టోబర్ 31న పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ ఎం. శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ బెజవాడ ఏసోబులకు పోలీస్ శాఖ ఆత్మీయ వీడ్కోలు పలికింది. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత ఐపీఎస్ పదవీ విరమణ పొందిన ఇద్దరు సిబ్బందిని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఎం. శ్రీనివాసరావు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా, బెజవాడ ఏసోబు జగ్గయ్యపేటలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ కె.జి.వి. సరిత మాట్లాడుతూ దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల పాటు ప్రజలకు రక్షణగా నిలిచి సేవలందించడం గొప్ప విషయమన్నారు. పోలీస్ శాఖలో ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదురైనా బాధితులకు న్యాయం, సహాయం అందించినప్పుడు కలిగే ఆత్మసంతృప్తి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందుతున్న అధికారులు, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్‌ఐ శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమయ్య, సీపీ కార్యాలయ పరిపాలనా విభాగ సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.