BREAKING
ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి

విశాఖ ఉక్కులో ముగిసిన విజిలెన్స్ వారోత్సవాలు

Select Suryaa Now
విశాఖ ఉక్కులో ముగిసిన విజిలెన్స్ వారోత్సవాలు

గాజువాక, సూర్య :  విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ‘నిజాయితీతోనే అభివృద్ధి’ అనే నినాదంతో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆర్ఐఎన్ఎల్ సీఎండీ మాట్లాడుతూ.. విధులను నిజాయితీగా, పారదర్శకంగా నిర్వర్తించడమే అసలైన విజిలెన్స్ అని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకోవడానికి విజిలెన్స్ ఎప్పుడూ అడ్డంకి కాదని, పనులు సక్రమంగా జరిగేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. నిజాయితీని ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సీవీఓ సూచించారు. ముఖ్య అతిథి, ఎస్ఎస్‌సీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎస్.కిశోర్ మాట్లాడుతూ.. ముందస్తు విజిలెన్స్ చర్యలతో పాటు నిజాయితీ గల అధికారుల ప్రయోజనాలను కాపాడటం ఎంతో అవసరమని తెలిపారు. వేడుకల్లో చిన్నారుల వీధి నాటిక ఆహూతులను ఆకట్టుకోగా, వివిధ పోటీల విజేతలకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, సీజీఎంలు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.