BREAKING
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు* ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ

బియ్యం ధరలపై కీలక నిర్ణయం!

Select Suryaa Now
బియ్యం ధరలపై కీలక నిర్ణయం!

నిర్ణయించిన ధరలకే విక్రయించాలి

కిలో బియ్యంపై రూ.66 నుంచి రూ.79 వరకు ధరల నిర్ణయం.. అధిక ధరలు వసూలు చేస్తే వ్యాపారులపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి

(రంగారెడ్డి - మేజర్ న్యూస్) : బియ్యం ధరల నియంత్రణపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వివిధ రకాల బియ్యానికి గరిష్ట విక్రయ ధరలను నిర్ణయించారు. రైస్ మిల్లర్లు, ట్రేడర్లు, హోల్‌సేల్ డిపో నిర్వాహకులు, రిటైలర్లు నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. చంద్రా రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తే సంబంధిత వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల బియ్యం విక్రయ ధరలపై కమిషనర్‌తో జిల్లా, రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు.

నిర్ణయించిన గరిష్ట ధరలు ఇవే..

అధికారులు నిర్ణయించిన ధరల ప్రకారం తెలంగాణ బీపీటీ బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా బియ్యం కిలో రూ.74, తెలంగాణ శ్రీరామగోల్డ్ బియ్యం కిలో రూ.79 చొప్పున విక్రయించాల్సి ఉంటుంది. ఈ ధరలకు మించి వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు మొత్తాన్ని వసూలు చేయరాదని అధికారులు స్పష్టం చేశారు.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులు, హోల్‌సేల్ డిపో నిర్వాహకులు, రిటైలర్లు గరిష్ట విక్రయ ధరలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ సూచించారు. నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా అధిక ధరలకు బియ్యం విక్రయించినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు న్యాయమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉండేలా వ్యాపారులంతా అధికారుల నిర్ణయాలను పాటించాలని కోరారు.