BREAKING
-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్

భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం.. కన్నీరు పెడుతున్న రైతన్న

Select Suryaa Now
భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం.. కన్నీరు పెడుతున్న రైతన్న

కొల్చారం;మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో శనివారం కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఓవైపు వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మరోవైపు అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన రైతులు, ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న సమయంలో వర్షం కురవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు, వర్షపు నీటి ప్రవాహంలో కొంత ధాన్యం కొట్టుకుపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. నీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఏరుకుంటూ, తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఒక్కొక్కటిగా కుప్పలుగా చేసుకుంటూ కనిపించారు. నెలల తరబడి కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడంతో రైతన్నలు కన్నీరు పెట్టుకున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని, వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.