BREAKING
ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి

ఎన్నికల విధులకు 1,100 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు

Select Suryaa Now
ఎన్నికల విధులకు 1,100 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు

విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలను వినియోగించుకోనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. శనివారం నగర సాయుధ పోలీసు దళ మైదానంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొత్తం 1,100 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ప్రత్యేక పోలీసు అధికారులుగా పోలీస్ సిబ్బందితో కలిసి క్యూ లైన్ల నిర్వహణలో సేవలందించనున్నారని తెలిపారు. విధుల్లో ఉన్నప్పుడు ఓటర్లతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లలో క్రమపద్ధతిలో ఓటు వేసి బయటకు వెళ్లేలా చూడాలని సూచించారు. తమ క్రమశిక్షణ, సేవాభావంతో ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వాలంటీర్లు విధులు సులభంగా నిర్వహించేందుకు ప్రజలకు సూచనలు ఇచ్చే ధ్వని ప్రసార పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పుష్కరాలు, దసరా ఉత్సవాలు, ఎన్నికల సమయంలో వినియోగించేందుకు 1,150 పరికరాలను కొనుగోలు చేసినట్లు వివరించారు. సబ్ కలెక్టర్ వెన్నెల శ్రీను మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖతో పాటు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. ఇటీవల బుడమేరు వరదలు, దసరా ఉత్సవాల సమయంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించడంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కీలకంగా సేవలందించారని పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే సామాజిక సేవా కార్యక్రమాలు, ఎన్నికల విధుల్లో పాల్గొనడం ద్వారా వారిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కె.జి.వి. సరిత ఐపీఎస్, బి. సత్యనారాయణ, ఏఆర్ ఏసీపీ ప్రేమ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ ఎం.వి. దుర్గారావు, ఆర్‌ఐలు రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ రమేష్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, వివిధ కళాశాలలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.