BREAKING
అకాల వర్షానికి తడిసిన ధాన్యం...... లంకతోటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార హోరు ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో టిడిపిలో చేరిన 18కుటుంబాలు రాష్ట్రీయ ఏక్తా దివస్‌–2026లో మెదక్ జిల్లా ప్రతినిధుల భాగస్వామ్యం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత...... బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది ఆశీర్వదించండి,గెలిపించండి జిల్లా వాలీబాల్‌ విజేతగా ఆదర్శ పాఠశాల గుడ్లవల్లేరు మండలంలో పార్టీల ప్రచార హోరు శ్వాసపై ధ్యాస..మనసుకు ప్రశాంతత! ఎంఈఓ కర్ణాకర్ రెడ్డి సేవలు ఎనలేనివి... ఎన్నికల విధులకు 1,100 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కరువు మండలాలు డిక్లేర్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మిర్యాలగూడకు చేరిన తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర బీసీలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించడం లేదు – తీన్మార్ మల్లన్న బియ్యం ధరలపై కీలక నిర్ణయం!

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు

Select Suryaa Now
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు

విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 2026 అక్టోబర్ 26వ తేదీ నుంచి విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 26వ తేదీన ప్రధాన పరిపాలన భవనం    కార్యాలయం వద్ద  ఉపకులపతి  ఆచార్య జి పి రాజశేఖర్  విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నేడు  కెమిస్ట్రీ విభాగంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  ఉపకులపతి ఆచార్య జి పి రాజశేఖర్ పాల్గొని  విజిలెన్స్  ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి, అందరితో  ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ విధులను నిజాయితీ, నిబద్ధత, పారదర్శకతతో నిర్వహించాలని, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ విభాగాలు, అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న సహాయక సిబ్బందికి విజిలెన్స్, అవినీతి నిరోధక చర్యలు, పారదర్శకత మరియు నైతిక విలువలపై అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.