రాష్ట్రీయ ఏక్తా దివస్–2026లో మెదక్ జిల్లా ప్రతినిధుల భాగస్వామ్యం:
మెదక్;గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తా నగర్‌లో నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఏక్తా దివస్–2026 కార్యక్రమంలో మెదక్ జిల్లా నుంచి ప్రతినిధుల బృందం పాల్గొనడం గర్వకారణమని పల్వంచ రాజేందర్ గౌడ్ తెలిపారు.భారతదేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ జాతీయ వేడుకలు దేశ ప్రజల్లో ఐక్యతా భావాన్ని, దేశభక్తిని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.మెదక్ జిల్లా నుంచి ఏక్తా నగర్‌కు చేరుకుని జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే ఇలాంటి కార్యక్రమాలు యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాలను పెంపొందిస్తాయని తెలిపారు.దేశ ఐక్యతే మా సంకల్పం.. ప్రజాసేవే మా లక్ష్యం.. భారతమాత గౌరవమే మా గర్వం అని పేర్కొంటూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ దేశ ఐక్యత, సమగ్రత, సోదరభావం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఐక్యత మన బలం.. దేశభక్తి మన ధర్మం.. ప్రజాసేవ మన బాధ్యత