BREAKING
విఠలాపూర్‌కు ఆర్టీసీ బస్సు ప్రారంభం -గ్రామ ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం.. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం. సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విఠల్. అకాల వర్షానికి తడిసిన ధాన్యం...... లంకతోటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార హోరు ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో టిడిపిలో చేరిన 18కుటుంబాలు రాష్ట్రీయ ఏక్తా దివస్‌–2026లో మెదక్ జిల్లా ప్రతినిధుల భాగస్వామ్యం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత...... బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది ఆశీర్వదించండి,గెలిపించండి జిల్లా వాలీబాల్‌ విజేతగా ఆదర్శ పాఠశాల గుడ్లవల్లేరు మండలంలో పార్టీల ప్రచార హోరు శ్వాసపై ధ్యాస..మనసుకు ప్రశాంతత! ఎంఈఓ కర్ణాకర్ రెడ్డి సేవలు ఎనలేనివి... ఎన్నికల విధులకు 1,100 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కరువు మండలాలు డిక్లేర్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

Select Suryaa Now
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి  అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు


సూర్య- పెద్దపల్లి :మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అన్నారు.శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ (ఎన్‌సీఓఆర్డీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు గుర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారు రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ కేంద్రంలో చికిత్స పొందవచ్చని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణా సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కుమారస్వామి, పోలీసు, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.