విఠలాపూర్‌కు ఆర్టీసీ బస్సు ప్రారంభం -గ్రామ ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం..
చిన్నకోడూరు, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్ గ్రామ ప్రజల చిరకాల కల నెరవేరింది. గ్రామానికి నూతనంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం గ్రామంలో సర్పంచ్ నాగమణి ఎల్లయ్య, ఉపసర్పంచ్ యాదవ రెడ్డి బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు.ఇప్పటివరకు గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి గ్రామ ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. స్పందించిన మంత్రులు వెంటనే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించింది.మారుమూల గ్రామమైన విఠలాపూర్‌కు బస్సు సౌకర్యం కల్పించడం పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించి బస్సు సౌకర్యం కల్పించిన మంత్రులకు సర్పంచ్, ఉపసర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బస్సు గ్రామానికి చేరుకోగానే మహిళలు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు ఎల్లయ్యతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.