సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం. సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విఠల్.
పెద్ద శంకరంపేట్;సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విఠల్ అన్నారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని పెద్ద శంకరంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశ తొలి ఉప ప్రధానిగా హోం మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. భారతదేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948 సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశ వ్యాప్తంగా దాదాపు 543 సంస్థానాలను భారతదేశంలో కలిపిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన జయంతిని భారతదేశం మొత్తంలో జాతీయ ఐక్యత దినోత్సవం గా జరుపుకోవడం జరుగుతుందన్నారు..ఈ కార్యక్రమంలో పేట మండల బిజెపి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్. ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణ. బీజేవైఎం అధ్యక్షుడు బుగుడాల కృష్ణ. నాయకులు బోలా శంకర్.. వెంకయ్య నారాయణ బాగయ్య తదితరులు పాల్గొన్నారు..