మండల స్థాయిలో జంపని విద్యార్థులు ప్రథమ స్థానం
వేమూరు, భట్టిప్రోలు మేజర్ న్యూస్: రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో భాగముగా శనివారం వేమూరు మండలస్థాయి లో వేమూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వ్యాస రచన పోటీలలో పీఎంశ్రీ జిల్లాపరిషద్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వై. షోలమైట్ ప్రథమ స్థానం, పి. సంకీర్తన ద్వితీయ స్థానాలు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే బదరీ నారాయణ తెలిపారు. క్విజ్ పోటీలలో సంకీర్తన తృతీయ స్థానము పొందారన్నారు. ఈ సందర్బంగా పాఠశాలల్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాస్టర్ బదరి నారాయణ విద్యార్థులను, ప్రోత్సహించిన సోషల్ మేడమ్ అరుణ జ్యోతి ని అభిందించారు.