ఇందిరాగాంధీ సేవలు, త్యాగాలు చిరస్మరణీయం.… సూక్ష్మ నిర్మాణాల కళాకారుడు, షేక్ హాజీ గౌస్
ఖాజీపేట మేజర్ న్యూస్: భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరొందిన స్వర్గీయ ఇందిరాగాంధీ 42వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఖాజీపేట బస్టాండ్‌లో ఘనంగా నివాళులర్పించారు.ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంఘం అధ్యక్షుడు, సూక్ష్మ నిర్మాణాల కళాకారుడు, కవి షేక్ హాజీ గౌస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా షేక్ హాజీ గౌస్ మాట్లాడుతూ.. దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, దేశ అభివృద్ధికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రచయిత షేక్ ఇంతియాజుద్దీన్, ఓబులరెడ్డి, ఈ. మహమ్మద్ హుస్సేన్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్: బోర్రా శివరామిరెడ్డి, మైదుకూరు ఇంచార్జ్, కడప జిల్లా