BREAKING
-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ శ్రీనివాస్

Select Suryaa Now
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ శ్రీనివాస్

పామర్రు మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మండల పరిధిలోని గ్రామాలలో ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పామర్రు ఎస్సై కుడిపూడి శ్రీనివాస్ హెచ్చరించారు. స్థానిక సంస్థ ఎన్నికలను పురస్కరించుకుని ఆయన మండలంలోని వివిధ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారిపైనైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ళఎన్నికల నియమావళిని అనుసరించి  పోలింగ్ కేంద్రాలకు 100 గజాల పరిధిలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి చర్యలకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రానికి100 గజాల లోపు ఉన్న నివాసిత ప్రజలు అపరిచిత వ్యక్తులకు బస చేసేందుకు ఆశ్రయం కల్పిస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు. మద్యం సేవించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా, పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు, ఉద్రిక్తతలు సృష్టించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే సోషల్ మీడియాలో కుల, మత, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు ఉంటాయన్నారు. సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలకు విరుద్ధమైన పోస్టులను అనుమతించరాదని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని, చట్టపరమైన ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచనలు చేశారు. మండల పరిధిలోని అడ్డాడ, కొమరవోలు, రాపర్ల తదితర గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పామర్రు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.