BREAKING
బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది ఆశీర్వదించండి,గెలిపించండి జిల్లా వాలీబాల్‌ విజేతగా ఆదర్శ పాఠశాల గుడ్లవల్లేరు మండలంలో పార్టీల ప్రచార హోరు శ్వాసపై ధ్యాస..మనసుకు ప్రశాంతత! ఎంఈఓ కర్ణాకర్ రెడ్డి సేవలు ఎనలేనివి... ఎన్నికల విధులకు 1,100 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కరువు మండలాలు డిక్లేర్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మిర్యాలగూడకు చేరిన తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర బీసీలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించడం లేదు – తీన్మార్ మల్లన్న బియ్యం ధరలపై కీలక నిర్ణయం! భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం.. కన్నీరు పెడుతున్న రైతన్న పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు బిరదవోలులో సుమలత ప్రచార జోరు .. అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు! ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హరీష్ వర్ధన్ ముదిరాజ్....… కూటమి విజయానికి సాయిబాబా సన్నిధిలో హోమం

డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

Select Suryaa Now
డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

నరసన్నపేట, సూర్య : ప్రభుత్వ డిగ్రీ కళాశాల నరసన్నపేటలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా నిర్వహించారు. రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దాడ లత  మాట్లాడుతూ.. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం, భద్రతను కాపాడడంలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉందని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ శాంతి హేం మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర సమరంలో చేసిన సేవలను వివరించారు. స్వాతంత్ర అనంతరము భారతదేశంలో మిగిలిన స్వదేశీ సంస్థానాలను సమగ్రత కోసం విలీనం చేసిన సంఘటనలను వివరించారు. అధ్యాపకులు త్రినాధరావు, ఉమామహేశ్వరరావు, డిల్లేశ్వరరావు, ఏవో రాంబాబు తదితరులు పాల్గొన్నారు.