ప్రజా సంక్షేమం జగన్ తోనే సాధ్యం -- వరికూటి అశోక్ బాబు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండలం చింతమోటు గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, అభ్యర్థులకు మద్దతుగా, శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు. గ్రామంలోని ప్రజలకు కరపత్రాలు అందజేస్తూ, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. భట్టిప్రోలు మండల జడ్పీటీసీ అభ్యర్థి బొల్లెద్దు ప్రతాప్ కుమార్ ను, చింతమోటు ఎంపీటీసీ అభ్యర్థి శొంఠి నాగవేణి ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వేమూరు నియోజకవర్గంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని అశోక్ బాబు గారు ధీమా వ్యక్తం చేశారు. వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, పార్టీ అభ్యర్థులు ఇప్పటికే విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.