BREAKING
పెన్షన్ వెరిఫికేషన్లో పాల్గొన్న జిల్లా పంచాయతీ అధికారి జడ్పిటిసి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి ఉగ్ర ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ శ్రీనివాస్ విఠలాపూర్‌కు ఆర్టీసీ బస్సు ప్రారంభం -గ్రామ ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం.. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం. సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విఠల్. అకాల వర్షానికి తడిసిన ధాన్యం...... లంకతోటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార హోరు ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో టిడిపిలో చేరిన 18కుటుంబాలు రాష్ట్రీయ ఏక్తా దివస్‌–2026లో మెదక్ జిల్లా ప్రతినిధుల భాగస్వామ్యం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత...... బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది ఆశీర్వదించండి,గెలిపించండి జిల్లా వాలీబాల్‌ విజేతగా ఆదర్శ పాఠశాల గుడ్లవల్లేరు మండలంలో పార్టీల ప్రచార హోరు శ్వాసపై ధ్యాస..మనసుకు ప్రశాంతత!

ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావాలి.... * జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి ఆదేశం *

Select Suryaa Now
ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావాలి....  * జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి ఆదేశం *

​విజయనగరం, సూర్య :  మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7 గంటలకే ఖచ్చితంగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను శనివారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి పలు కీలక సూచనలు, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్‌లోని వెబ్ కాస్టింగ్ విధానాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోని కెమెరాలు సరైన రీతిలో పనిచేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఓటరు వేసే ఓటు రహస్యంగా ఉండేలా (ఓటు సీక్రెసీ దెబ్బతినకుండా) కెమెరాల అమరిక ఉండాలని అధికారులను ఆదేశించారు. ​పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని, 7 గంటలు అయ్యేసరికి అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రారంభం కావాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతీ గంటకు ఓటింగ్ శాతానికి సంబంధించిన నివేదికలను కంట్రోల్ రూమ్‌కు అందించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా ఓటర్లు గుమిగూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ​విధులు నిర్వర్తిస్తున్న పోలింగ్ సిబ్బందికి సకాలంలో టిఫిన్, భోజనం, స్నాక్స్ అందేలా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని అధికారులకు తేల్చి చెప్పారు. అలాగే, పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే సిబ్బందితో కూడిన బస్సులు సురక్షితంగా బయలుదేరేలా రవాణా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ లో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, డిఆర్‌ఓ సిహెచ్. సత్తిబాబు, ఎస్‌డిసిలు ఇ. మురళి, వెంకటరెడ్డి మరియు ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు.